‘హరిహర వీరమల్లు’పై క్రేజీ న్యూస్.. పవన్ ఫ్యాన్స్‌కు పండగే!

‘హరిహర వీరమల్లు’పై క్రేజీ న్యూస్.. పవన్ ఫ్యాన్స్‌కు పండగే!

Published on May 3, 2025 11:04 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి హిస్టారికల్ చిత్రంగా ఈ మూవీ రానుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, ఈ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నాడట. ఆయన ఈ చిత్ర షూటింగ్‌లో మే 4 నుంచి జాయిన్ కాబోతున్నట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌ను మే 7 లేదా మే 8 వరకు ముగించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. ఇక పవన్ షూటింగ్ పూర్తి చేయడంతో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకునేందుకు సిద్ధమవుతుంది.

ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఎంఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు