‘హిట్ 3’ వరల్డ్ వైడ్ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్!

‘హిట్ 3’ వరల్డ్ వైడ్ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్!

Published on May 1, 2025 7:02 AM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘హిట్ 3’. మరి సాలిడ్ హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఈ మధ్య కాలం మన తెలుగు నుంచి ఏ సినిమా కూడా అందుకోని బజ్ నడుమ విడుదలకి వచ్చింది. ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలు సహా యూఎస్ మార్కెట్ లో కూడా సాలిడ్ బుకింగ్స్ ని నమోదు చేయగా నాని కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ని ప్రామిస్ చేసే విధంగా ట్రెండ్ ని కొనసాగించింది.

మరి ఇలా హిట్ 3 డే 1 వరల్డ్ వైడ్ అందుకునే అంచనా వసూళ్లు ఇపుడు తెలుస్తున్నాయి. అయితే ఈ చిత్రం నాని కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకునే ఛాన్స్ ఉన్నట్టుగా ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఇదివరకు దసరా సినిమా 38 కోట్లతో హైయెస్ట్ నెంబర్ సెట్ చేయగా దీనిని హిట్ 3 బ్రేక్ చేసి 40 కోట్ల మేర వరకు వెళ్లే ఛాన్స్ ఉందట. మెయిన్ గా ఏపీలో ఇచ్చిన హైక్స్ హిట్ 3 కి ప్లస్ అయ్యినట్టు తెలుస్తుంది. మరి డే 1 కి అధికారికంగా హిట్ 3 ఏ రేంజ్ వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు