మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్, డైరెక్టర్ షాజీ కరుణ్ సోమవారం కన్నుమూశారు. గతకొన్నేళ్లుగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. సినిమాటోగ్రఫర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన, దర్శకుడిగా పలు సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించారు.
మోహన్ లాల్ హీరోగా ‘వానప్రస్థం’ డైరెక్టర్‌గా షాజీ కరుణ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ‘పిరవి’ మూవీతో ఆయన ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. షాజీ కరుణ్‌ను భారత ప్రభుత్వం 2011లో ‘పద్మశ్రీ’తో సత్కరించింది.
పిరవి, స్వాహం, వానప్రస్థం, నిషాద్, కుట్టి శృంఖు, స్వప్నం వంటి సూపర్ హిట్ చిత్రాలను ఆయన డైరెక్ట్ చేశారు. షాజీ కరుణ్ మృతికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు తమ సంతాపం తెలుపుతున్నారు.