క్రికెట్ అభిమానులకు ఇటీవల జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఎలాంటి కిక్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఇండియన్ ఫ్యాన్స్‌కు ఈయేడు ఛాంపియన్స్ ట్రోఫీ కలిసొచ్చింది. భారత జట్టులోని ప్లేయర్లు అందరూ తమ వంతు కృషితో ఇండియాకు కప్పు తీసుకొచ్చారు. ఇక ఈసారి కొందరు ప్లేయర్లు తమ సత్తా చాటడంతో వారు హైలైట్ అయ్యారు. అలాంటి వారిలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఒకరు.
స్పి్న్ బౌలింగ్‌తో ప్రత్యర్థులకు వణుకు పుట్టించాడు ఈ ఆటగాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 5 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు ఈ ఆటగాడు. అయితే, వరుణ్ చక్రవర్తికి సంబంధించి ఓ వార్త చాలా తక్కువ మందికి తెలుసు. వరుణ్ తొలినాళ్లలో ఓ సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. తమిళ హీరో జీవా నటించిన ‘జీవా’ అనే చిత్రంలో వరుణ్ ఓ సీన్లో కనిపిస్తాడు. ఈ సినిమా కూడా క్రికెట్‌కు సంబంధించిన కథతో తెరకెక్కింది.
ఆ సినిమాలో వరుణ్ చక్రవర్తి నటించాడనే విషయం చాలా మందికి తెలియదు. ఇక ఇప్పుడు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రిఫరెన్సులు పెడుతుండటంతో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్‌ను అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.