మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఇపుడు నటిస్తున్న అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో చేస్తున్న సాలిడ్ చిత్రం “కింగ్డమ్” కూడా ఒకటి. మరి రీసెంట్ టీజర్ తోనే భారీ హైప్ ని అందుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు.
అయితే లేటెస్ట్ గా విజయ్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. తన దర్శకుడు గౌతమ్ బర్త్ డే ని సెట్స్ లో చేసిన పిక్ ని షేర్ చేసి ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని తాను షేర్ చేసాడు. బాయ్స్(మేము) సిద్ధం అవుతున్నాము అని ప్రస్తుతం కింగ్డమ్ లాస్ట్ షెడ్యూల్ చేస్తున్నాం. ఈ సినిమాకి ప్రతి రోజు ఎంజాయ్ చేస్తున్నాను.
నా దర్శకుడు గౌతమ్ బర్త్ డే ని సెట్స్ లో చేయడం ఆనందంగా అనిపించింది. ఈ ఏడాదిలో ఒక గొప్ప కథని మీకు చెప్పబోతున్నాం అంటూ ఒక బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేసి తెలిపాడు. ఇందులో గౌతమ్ తో పాటుగా విజయ్ హ్యాపీ మూమెంట్స్ గమనించవచ్చు. ఇలా సాలిడ్ అప్డేట్ సహా సినిమా షూటింగ్ ని ఎంతలా తాను ఆస్వాదిస్తున్నాడో చెప్పిన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది.
Boys getting RWDY 🙂
Happy birthday @gowtam19 ❤️
We are shooting our last schedule together and i have enjoyed everyday of making #KINGDOM with you. We will tell a great story this year and more importantly we make memories and a bond for life.
May you have the best of… pic.twitter.com/DfaEbGA8AT
— Vijay Deverakonda (@TheDeverakonda) March 2, 2025