అక్కినేని యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం “తండేల్”. మరి ఎన్నో అంచనాలు నడుమ మెయిన్ గా చిత్ర యూనిట్ పెట్టుకున్న బలమైన నమ్మకం నడుమ వచ్చిన ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఇక ఇలా సాలిడ్ బుకింగ్స్ కూడా ఓవరాల్ గా నమోదు అవుతుండగా మరి యూఎస్ మార్కెట్ లో కూడా మంచి వసూళ్లు ఈ సినిమా రాబడుతుంది.
ఇక ఇలా లేటెస్ట్ గా తండేల్ 3 లక్షల 50 వేలకి పైగా డాలర్లు గ్రాస్ ని అందుకొని అదరగొట్టింది. దీనితో ఈజీగా ఇపుడు హాఫ్ మిలియన్ డాలర్లు మార్క్ ని దాటేస్తుంది అని చెప్పవచ్చు. అలాగే లాంగ్ రన్ లో కూడా మరింత బెటర్ వసూళ్లు అందుకోనుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు అలాగే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
#Thandel races past $350K+ at the USA box office ????????????
The wave is only getting stronger????????#BlockbusterThandel @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP @GeethaArts @TheBunnyVas @ThandelTheMovie pic.twitter.com/8VW9Fj07gC
— Prathyangira Cinemas (@PrathyangiraUS) February 7, 2025