ఓటిటిలో “గేమ్ ఛేంజర్”.. అప్పన్నదే డామినేషన్

ఓటిటిలో “గేమ్ ఛేంజర్”.. అప్పన్నదే డామినేషన్

Published on Feb 7, 2025 9:01 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన సాలిడ్ పొలిటికల్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా “గేమ్ ఛేంజర్”. ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో నటీనటులు మాత్రం సాలిడ్ పెర్ఫామెన్స్ లని అందించారు. అయితే వారిలో రామ్ చరణ్ మరోసారి ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.

ఇక లేటెస్ట్ గా బిగ్ స్క్రీన్స్ నుంచి ఓటిటిలోకి ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేయగా ఇక్కడ కూడా రామ్ చరణ్ పోషించిన అప్పన్న పాత్ర డామినేషన్ ఓ రేంజ్ లో కనిపిస్తుంది. సోషల్ మీడియాలో మరోసారి చాలా మంది అప్పన్న పాత్రపై అలాగే అందులో రామ్ చరణ్ నటనని ప్రశంసిస్తున్నారు. దీనితో ఈ సినిమాలో మరోసారి అప్పన్న రోల్ హైలైట్ అవుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు