ఫోటో మూమెంట్: “లైలా” కోసం “విశ్వంభర”

ఫోటో మూమెంట్: “లైలా” కోసం “విశ్వంభర”

Published on Feb 7, 2025 4:03 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ సినిమా “విశ్వంభర” చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతుండగా మరో పక్క మన టాలీవుడ్ నుంచి పలు సినిమాలు థియేటర్స్ లో అలరించేందుకు వస్తున్నాయి. మరి ఇలా లేటెస్ట్ గా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న అవైటెడ్ సినిమా “లైలా” కూడా ఇపుడు వస్తుంది.

ఈ వాలెంటైన్స్ డే కానుకగా మేకర్స్ ఈ చిత్రాన్ని తీసుకొస్తుండగా ఈ సినిమా కోసం ఇపుడు మెగాస్టార్ చిరంజీవిని మేకర్స్ తీసుకొస్తున్నారు. లాస్ట్ టైం జీబ్రా ప్రీ రిలీజ్ కి వచ్చిన మెగాస్టార్ ఇపుడు లైలా కోసం రానున్నట్లు విశ్వక్ తెలిపాడు. చిరంజీవిని కలిసి ఆహ్వానించిన పిక్స్ ఇపుడు వైరల్ గా మారాయి. తనతో పాటుగా నిర్మాత సాహు గారపాటి కూడా కలిసి చిరుని ఆహ్వానించారు. దీనితో ఈ ఫోటో మూమెంట్ వైరల్ గా మారింది. ఇక ఈ ఈవెంట్ డేట్ ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు