ఓవర్సీస్ లో రఫ్ఫాడిస్తున్న “సంక్రాంతికి వస్తున్నాం”

ఓవర్సీస్ లో రఫ్ఫాడిస్తున్న “సంక్రాంతికి వస్తున్నాం”

Published on Jan 19, 2025 10:53 PM IST

మన తెలుగు సినిమా మోస్ట్ లవబుల్ స్టార్ హీరో వెంకీ మామ హీరోగా ఇద్దరు హీరోయిన్స్ మీనాక్షి చౌదరి అలాగే ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్స్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన క్రేజీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” ఏ రేంజ్ లో అదరగొడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సెన్సేషనల్ వసూళ్లు ఈ చిత్రం అందుకుంటుంది.

ఇలా ఆల్రెడీ యూఎస్ మార్కెట్ లో 1.9 మిలియన్ డాలర్స్ కి పైగా గ్రాస్ క్రాస్ చేసి 2 మిలియన్ క్లబ్ లో జాయిన్ అవుతుండగా ఇపుడు ఆస్ట్రేలియా మార్కెట్ లో 3 లక్షల 3 వేల డాలర్స్ కి పైగా గ్రాస్ ని వసూలు చేసి ఇంకా స్ట్రాంగ్ గా దూసుకెళ్తూ హాఫ్ మిలియన్ డాలర్స్ దిశగా వెళుతుంది. దీనితో సంక్రాంతికి వస్తున్నాం సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా రఫ్ఫాడిస్తుంది అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు