ఊ కొడతారా ఉలిక్కి పడతారా షూటింగ్ లో పాల్గొంటున్న సోను సూద్

ఊ కొడతారా ఉలిక్కి పడతారా షూటింగ్ లో పాల్గొంటున్న సోను సూద్

Published on Dec 20, 2011 1:39 PM IST


తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటుడిగా పేరు తెచ్చుకున్న సోను సూద్ ఎన్నో చిత్రాలలో నటించారు. ప్రస్తుతం ఆయన మంచు లక్ష్మి నిర్మిస్తున్న ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రంలో నటించబోతున్నాడు. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మంచు లక్షి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆమె సోదరుడు అయిన మంచు మనోజ్ నటిస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ గారు ముఖ్య అతిధి పాత్రలో నటిస్తున్నారు. దీక్షా సేథ్ మరియు పంచి బొరా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రోజు నుండి సోను సూద్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.శేఖర్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి హైదరాబాద్ శివార్లలో ఒక భారీ సెట్ వేసి చిత్ర ముఖ్య భాగం అక్కడే చిత్రీకరిస్తున్నారు. సోను సూద్, ప్రభు, రిషి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు