తన లేడీ ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ఇవ్వనున్న ప్రభాస్.!

తన లేడీ ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ఇవ్వనున్న ప్రభాస్.!

Published on Feb 24, 2013 4:30 PM IST

prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనగానే గుర్తొచ్చేది ఆరడుగుల ఆజానుబాహుడు, దానికి తగ్గా పర్ఫెక్ట్ ఫిజిక్, హన్డ్సం లుక్. ఇవన్నీ కలగలిపిన ప్రభాస్ కి మొదటి నుంచీ లేడీ ఫ్యాన్స్ ఉన్నారు. అందులోనూ ‘డార్లింగ్’, ‘Mr పర్ఫెక్ట్’, ‘మిర్చి’ సినిమాల తర్వాత ప్రభాస్ కి విపతీరంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇటీవలే విడుదలైన ‘మిర్చి’ సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.

ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ కదా వాళ్ళందరూ మీతో మాట్లాడాలి అనుకుంటే ఎలా? అని అడిగితే ప్రభాస్ సమాధానమిస్తూ ‘ నేను ఎక్కడన్నా బయట కనపడితే చాలా మంది మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు. అలాగే ఉత్తరాలు, ఈ మెయిల్స్ చాలానే వస్తుంటాయి. అవన్నీ చూసినప్పుడు నాకు వారితో మాట్లాడాలి అనిపిస్తుంది. ఆడియో ఫంక్షన్స్ కి, ఇంకేదైనా ఫంక్షన్స్ కి పిలిచి అక్కడ మాట్లాడాలి అనుకున్నా కానీ అక్కడ కష్టమైపోతుంది. అందుకే ఆ ఆలోచన వద్దనుకున్నా. అందుకే ఖాళీ చూసుకొని వారందరి కోసం ఇంట్లోనే ఓ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళని పిలుద్దామనే ఆలోచనలో ఉన్నాను. అలా చేస్తేనే కదా నా ఫ్యాన్స్ కూడా హాపీ అవుతారని’ అన్నాడు. ప్రభాస్ లేడీ ఫ్యాన్స్ కి ఇదొక బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవాలి.

తాజా వార్తలు