ఆర్యతో సమంత జత కట్టనుందా??

ఆర్యతో సమంత జత కట్టనుందా??

Published on Feb 24, 2013 3:10 PM IST

Samantha-and-arya

అందాల నటి సమంత తమిళ ఇండస్ట్రీలో తన కెరీర్ ప్లాన్ చేసుకునే పనిలో ఉంది. ఎస్.ఎస్. రాజమౌళి ‘నాన్ ఈ’ సినిమాతో గెలుపు రుచిని చూసిన ఆమె గౌతం మీనన్ ‘నీతానే ఎన్ పొన్వసంతం’ చిత్రంలో నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం సంపాదించుకుంది. తాజా సమాచారం ప్రకారం ఆమె ఆర్యకి జంటగా ఒక తమిళ్ సినిమాకి సంతకం చేసిందంట. వీరిద్దరూ ఒక తమిళ సినిమాకి కలిసి పనిచెయ్యడం ఇదే మొదటిసారి. ఒకప్పటి గౌతం మీనన్ అసిస్టెంట్ మఘీజ్ తిరుమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఆర్య ఈ సినిమాలో పోలిస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు, సమంత అతని ప్రేమికురాలిగా కనిపించనుంది. ఈ సినిమా మార్చ్ లో మొదలు కావచ్చని అంచనా. ఇదేకాక సమంత లింగుస్వామి దర్శకత్వంలో సూర్య హీరోగా నటించనున్న మరో చిత్రానికి కూడా సంతకం చేసింది.

ప్రస్తుతం సమంత పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్న తెలుగు చిత్రం షూటింగ్ లో పాల్గొంటుంది. ఇదేకాక ఎన్.టి.ఆర్ సరసన నాయికగా మరో రెండు చిత్రాలలో నటిస్తుంది. ఇవే కాకుండా వి.వి వినాయక డైరెక్షన్ లో బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ హీరోగా పరిచయం కాబోతున్న మరో సినిమాలో కూడా సమంతాయే నాయిక.

తాజా వార్తలు