ఆ సినిమా కోసం టెర్రరిస్ట్లు కుడా ఎదురుచూస్తున్నారట.!

ఆ సినిమా కోసం టెర్రరిస్ట్లు కుడా ఎదురుచూస్తున్నారట.!

Published on Feb 24, 2013 12:01 PM IST

India-pi-daadi

ఈ పరిశ్రమలో ఒక దర్శకుడు సినిమా తీయాలంటే కథ కావాలి. కానీ ఈ దర్శకుడికి మాత్రం ఒక సినిమా తీయాలంటే కారణం కావాలి. అతనే మన క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇతని లేటెస్ట్ మూవీ ‘ది ఎటాక్స్ అఫ్ 26/11′, ఈ మూవీ ని తెలుగులో ’26/11 – ఇండియాపై దాడి’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ఆడియో లాంచ్ శనివారం రాత్రి హైదరాబాద్లో జరిగింది.

ఈ సందర్భంగా వేడుకకి హాజరయిన అతిధులు భాస్కర భట్ల, కోనా వెంకట్, జె.కె భారవి, ఆర్.పి పట్నాయక్, బ్రహ్మాజీ తదితరులు రామూని పొగడ్తలలో ముంచెత్తారు. రాము మాట్లాడుతూ “ఇప్పటిదాకా నా చిత్రాలని కన్విక్షన్ తో, ఫ్యాషన్ తో, పొగరుతో చేసాను. కానీ ఈ సినిమాని మాత్రం భయంతో చేసాను. నా జీవితంలో గుర్తుండిపోయే చిత్రం ఇదని” అన్నారు. హిందీలో మార్చ్ 1న రిలీజ్ కానున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ మార్చ్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు