‘మిస్టర్ పెళ్ళికొడుకు’ మార్చ్ విడుదల వెనుక ఉన్న మతలబు ఏంటి ?

‘మిస్టర్ పెళ్ళికొడుకు’ మార్చ్ విడుదల వెనుక ఉన్న మతలబు ఏంటి ?

Published on Feb 24, 2013 1:11 AM IST

Mr-Pellikoduku

కామెడీ హీరో సునీల్, ఇషా చావ్లా హీరో, హీరోయిన్ గా నటించిన ‘మిస్టర్ పెళ్ళికొడుకు’ సినిమా మార్చ్ 1న విడుదలకానుంది. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్ పై ఎన్.వి.ప్రసాద్, పరస్ జైన్ లు నిర్మించిన ఈ సినిమాకి దేవీ ప్రసాద్ దర్శకత్వం వహించారు. సునీల్ ‘మర్యాద రామన్న’, ‘పూల రంగడు’ సినిమాలు విజయాన్ని సాదించడంతో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాదిస్తుంది అని అందరు అనుకుంటున్నారు. మార్చ్ లో స్టూడెంట్స్ అందరికి ఎగ్జామ్స్ ఉండటంతో పెద్ద హీరోల సినిమాలానే విడుదలచేయారు అలాంటిది ఈ సినిమాను విడుదల చేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ సినిమా ఫుల్ కామెడీతో ఉండటం ఎగ్జామ్స్ టెన్షన్స్ తో ఉన్న స్టూడెంట్స్ కూడా మిస్టర్ పెళ్లి కొడుకు చూసి రిలాక్స్ అవుతారని నిర్మాతలు చెబుతున్నారు.

తాజా వార్తలు