మరోసారి హరిప్రియతో జోడీకడుతున్న యువ హీరో

మరోసారి హరిప్రియతో జోడీకడుతున్న యువ హీరో

Published on Feb 22, 2013 3:00 PM IST

Varun-Sandesh_hari_priya

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని వరుణ్ సందేశ్ ప్రయత్నిస్తున్నాడు. యువ తారలలో బాగా బిజీగా ఉన్న తారలలో తనూ ఒకడు, కానీ ఇవేవి తనకొచ్చే నూతన చిత్రాలను ఆపలేకపోతున్నాయ్. ఇటీవల త్రినాద్ రావు దర్శకత్వం వహించనున్న ‘నువ్విలా నేనిలా’ చిత్రానికి జతకట్టిన అతను, మరో కొత్త సినిమా ‘ఈ వర్షం సాక్షిగా’కి కుడా సంతకం చేసాడు.

వరుణ్ సందేశ్ – హరిప్రియ కలిసి నటించిన మొదటి సినిమా ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’. ఈ సినిమా తర్వాత మరోసారి వరుణ్, హరిప్రియ నటిస్తున్న’ఈ వర్షం సాక్షిగా’ అనే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి రమణ మొగిలి – బి.ఒబుల్ సుబ్బారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాస్ చవాకుల రాహుల్ మీడియా బ్యానర్ ద్వారా నిర్మిస్తున్నాడు. ‘ఈ వర్షం సాక్షిగా’ ఈ నెల 27నుంచి లాంచ్ అయ్యి ఆ తరువాత సెట్స్ మీదకు వెళ్లనుంది. అనిల్ గోపి రెడ్డి సంగీతం సమకూరుస్తున్నాడు.

తాజా వార్తలు