స్విట్జర్లాండ్ బయలుదేరిన ఎన్.టి.ఆర్ – కాజల్

స్విట్జర్లాండ్ బయలుదేరిన ఎన్.టి.ఆర్ – కాజల్

Published on Feb 20, 2013 9:15 PM IST

Jr.NTR-Kajal-Agarwal
ఎన్.టి.ఆర్, కాజల్ నటిస్తున్న ‘బాద్షా’ సినిమాకి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే బార్సిలోనాలో కాజల్, ఎన్.టి.ఆర్ జంటపై ఓ పాట చిత్రీకరించారు. అనుకోకుండా అక్కడే పాట చిత్రీకరణ జరుపుకుంటున్న పూరి జగన్నాధ్ ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్ర బృందాన్ని కలుసుకున్నారు. ప్రస్తుతం బాద్షా చిత్ర బృందం మొత్తం స్విట్జర్లాండ్లో మరో పాట చిత్రీకరణలో నిమగ్నమయింది .

“అనుకోకుండా పూరి గారిని, బన్నీని వాళ్ళ చిత్ర యూనిట్ ని స్పెయిన్ లో కలుసుకోవడం ఆనందంగా వుంది!! ‘బాద్షా’ టీంతో ఒక పాట పూర్తి చేశాను .ఇప్పుడు స్విట్జర్లాండ్ లో ఉన్నాం! ఇక్కడ చలిలో గడ్డ కడుతున్నాం!!’ అని కాజల్ తన సోషల్ నెట్వర్కింగ్ పేజిలో పోస్ట్ చేసింది. బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్.టి.ఆర్ పాత్రకి రెండు విభిన్న కోణాలు వుంటాయని ఈ చిత్రం తప్పకుండా విజయం సాదిస్తుందని చిత్ర బృందం అంతా చాలా నమ్మకంగా వున్నారు. శ్రీను వైట్లతో పాటుగా గోపి మోహన్ మరియు కోన వెంకట్ స్క్రిప్ట్ ని అందించారు. థమన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో మార్చ్ 10న, అలాగే సినిమాని ఏప్రిల్ 5న విడుదల కానున్నాయి.

తాజా వార్తలు