‘ప్రియతమా నీవచట కుశలమా’ ఆడియో లాంచ్ ఫిబ్రవరి 21న హైదరాబాద్లో జరగనుంది. ఈ రొమాంటిక్ సినిమాలో వరుణ్ సందేశ్ హీరో, హసిక మరియు కోమల్ ఝా లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘మేం వయసుకి వచ్చాం’ సినిమాకి దర్శకత్వం వహించిన త్రినాధ్ రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, సాంబశివరావు సుధా సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు. సినిమాలో చాలా భాగం విజయవాడ, రాజమండ్రి , హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో చిత్రీకరించారు.
ఇదిలా వుండగా వరుణ్ సందేశ్ మరియు త్రినాధ్ రావు ‘నువ్విలా నేనిలా’ అనే మరో మూవీని ప్రారంభించారు .ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే హైదరాబాద్లో ప్రారంభం అయింది .ఈ రెండు చిత్రాలే కాకుండా సిరాజ్ కల్లా ‘డీ ఫర్ దోపిడీ’, ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’ మరియు ‘సరదాగా అమ్మయిలతో’ చిత్రాలతో వరుణ్ సందేశ్ ప్రేక్షకులను అలరించనున్నాడు.