డబ్బింగ్ దశలో బాద్షా

డబ్బింగ్ దశలో బాద్షా

Published on Feb 20, 2013 8:20 AM IST

NTR-in-Baadshah2

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాద్షా టాకీ పార్ట్ పూర్తి చేసుకుని పాటల చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవలే ఐటెం సాంగ్ షూట్ పూర్తి చేసి మరో పాట కోసం స్పెయిన్ వెళ్ళిన విషయం తెలిసిందే. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శర వేగంగా పూర్తి చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్లో భాగంగా డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రవణ్ డబ్బింగ్ నిన్న పూర్తి కాగా మరికొంతమంది కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ డబ్బింగ్ కూడా జరుగుతుంది. స్పెయిన్లో పాట చిత్రీకరణ తరువాత స్విట్జర్లాండ్లో మరో పాట చిత్రీకరిస్తారు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకుడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ స్వరాలు అందించాడు.

తాజా వార్తలు