యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘బాద్ షా’ చిత్రీకరణలో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రీకరణలో ఉండగా స్పెయిన్ లో ఒకళ్ళని ఒకళ్ళు కలుసుకున్నారు. ఈ రెండు చిత్రాలనీ బండ్ల గణేష్ నిర్మిస్తుండగా రెండు టీంలూ సరదాగా ఒకచోట కలిసారు.
కాజల్ అగర్వాల్, అమల పాల్, పూరి జగన్ మరియు శ్రీను వైట్ల చాలా ఉత్సాహంతో అల్లు అర్జున్ ఎన్.టి.ఆర్ లతో జత కలిసారు.
ఇలాంటి ఇద్దరు హీరోలు కలిసి తీయించుకున్న ఫోటోలు చాల అరుదు కాబట్టి అవి వారి ఫాన్స్ కి చాలా ఆనందాన్ని పంచుతున్నాయి.