‘ఎస్.ఎం.ఎస్’ సినిమాతో మనకు పరిచయమైన సుధీర్ బాబు త్వరలో ‘ప్రేమ కధా చిత్రమ్’ ద్వారా మళ్ళీ మన ముందుకు రానున్నాడు. జె. ప్రభాకర్ రెడ్డి ఈ సినిమాకి డైరెక్టర్ కమ్ సినిమాటోగ్రాఫర్. ‘ఈరోజుల్లో’, ‘బస్ స్టాప్’ వంటి రెండు సూపర్ హిట్లు ఇచ్చిన తరువాత మారుతి ఈ సినిమాని పర్యవేక్షించడమే కాక సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. అంతే కాక ఈ ”ప్రేమ కధా చిత్రమ్’ కి తనే మాటలు మరియు కథ అందించాడు.
ఈ సినిమాలో సుధీర్ బాబు, నందిత జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ శివార్లలో హీరో హీరోయిన్స్ పై షూటింగ్ జరుగుతోంది. జె.బి. సంగీత దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ శివరాత్రి సందర్బంగా మార్చి 10న, ఆడియో లాంచ్ ఏప్రిల్ 10న విడుదల కానుంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ మూవీ మే 10న మన ముందుకు రావచ్చు