ఆంధ్రప్రదేశ్లో ‘అమృతం’ టీవీ సీరియల్ తెలియని వారు ఎవరూ ఉండరు, ఆ సీరియల్ డైరెక్టర్ మరియు ‘సై’ సినిమా నుంచి ‘ఈగ’ వరకు ఎస్.ఎస్ రాజమౌళి సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ చేసిన ఎస్.ఎస్ కాంచి చాలా కాలం తర్వాత ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ అనే సినిమాకి కథని అందించారు. మీరు చాలా నిదానంగా, సెలెక్టివ్ గా సినిమాలు చేయడానికి గల కారణం ఏమిటి అనడిగితే ఆయన సమాధానమిస్తూ ‘ అందుకు రెండు రీసన్స్ ఉన్నాయి మొదటిది నాకు నేనుగా వెళ్ళి అవకాశం ఇమ్మని ఎవరినీ అడగను, ఇక రెండవది నాకు లైక్ మైండెడ్ వ్యక్తులతో పనిచేయాలంటే ఇష్టం. అంటే కథ నచ్చితే నచ్చిందని లేదా బాలేదని చెప్పాలి కానీ మన నిర్మాతలు, డైరెక్టర్లు నాకు నచ్చని దానిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ నిజంగా నా తప్పే ఉంటే మార్చుకుంటానని’ అన్నాడు.
అలాగే ఈ సినిమా గురించి చెబుతూ ‘ ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ కానీ ఇందులో లేడీకి ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ వల్ల హీరో హైలైట్ అవుతాడు. అలాగే హీరోది ఏం జరిగినా మనమంచికే అనుకునే పాత్రని’ ఆయన తెలిపారు. సుమంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి చంద్ర సిద్దార్థ్ డైరెక్టర్.