ఢిల్లీ రేప్ భాదితురాలిపై ఆర్. నారాయణమూర్తి సినిమా

ఢిల్లీ రేప్ భాదితురాలిపై ఆర్. నారాయణమూర్తి సినిమా

Published on Feb 19, 2013 8:22 AM IST

r-narayanamurthy

ఢిల్లీలో జరిగిన రేప్ ఘటన దేశం మొత్తం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తరువాత యువత కదిలివచ్చి ప్రభుత్వాన్ని నిలదీసినా నిందితుల్ని అరెస్ట్ చేయడం మినహా ప్రభుత్వం పెద్దగా ఏమీ చేయలేకపోయింది. ఈ ఘటన తరువాత కూడా మహిళలపై అకృత్యాలు పెరిగాయే కానీ మార్పు మాత్రం శూన్యం. ఈ ఢిల్లీ రేప్ ఘటన ఉదంతాన్ని నేపధ్యంగా తీసుకుని ఆర్. నారాయణ మూర్తి ఒక సినిమా రూపొందించనున్నాడు. ‘కలకత్తా కాళి’ పేరుతో రానున్న ఈ సినిమా ఈ నెల 23నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అధిక భాగం కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని ప్రాంతంలో షూటింగ్ జరగనుంది.

తాజా వార్తలు