వినూత్న తరహాలో బాద్ షా ఆడియో లాంచ్ ని ప్లాన్ చేస్తున్న గణేష్

వినూత్న తరహాలో బాద్ షా ఆడియో లాంచ్ ని ప్లాన్ చేస్తున్న గణేష్

Published on Feb 18, 2013 9:38 PM IST

Ganesh
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. హీరోగా నటిస్తున్న ‘బాద్ షా’ సినిమాపై దాని నిర్మాత బండ్ల గణేష్ చాలా ఆసక్తి చూపిస్తున్నాడు.ఈ సినిమాకి డైరెక్టర్ శ్రీను వైట్ల కాగా కాజల్ అగర్వాల్ హీరొయిన్. ‘బాద్ షా’ ఆడియో లాంచ్ మార్చ్ 10న జరగనుంది. మేము వింటున్న సమాచారం ప్రకారం బండ్ల గణేష్ ఈ ఈవెంట్ ని వినూత్న రీతిలో చేయడానికి కొత్త ఐడియాలు ప్లాన్ చేస్తున్నాడంట.

మరికొన్ని నివేదికల ప్రకారం ఎన్.టి.ఆర్ ఒక ప్రత్యేక లేర్జేట్ విమానంలో ఆడియో ఫంక్షన్ విజయవంతం కావడం కోసం పవిత్ర సింహాచలంలో ఉన్న స్వామీ వారిని సందర్శించనున్నాడంట. థమన్ ఈ మూవీకి సంగీతం అందించాడు.

ఈ సినిమా పాటల చిత్రీకరణ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతుండగా ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.

తాజా వార్తలు