భాయ్ సెట్లో మొదలైన రాధిక సందడి

భాయ్ సెట్లో మొదలైన రాధిక సందడి

Published on Feb 18, 2013 5:00 PM IST

Richa-Gangopadhyay
‘భాయ్’ అంటే ‘కింగ్’ నాగార్జున నటిస్తున్న కొత్త సినిమా అని తెలుసు, అలాగే ఈ సినిమాలో నాగ్ సరసన రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా నటిస్తోంది అదీ తెలుసు ఇంతకీ ఈ రాధిక ఎవరు? రాధిక ఏమన్నా ఒక పాత్ర చేస్తుందా అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరబాటే.. ఈ సినిమాలో రాధిక ఎలాంటి పాత్ర చెయ్యడం లేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రిచా గంగోపాధ్యాయ్ పాత్ర పేరు రాధిక. ఇటీవలే వచ్చిన ‘మిర్చి’ సినిమా సక్సెస్ తో ఫుల్ హ్యాపీ గా ఉన్న ఈ భామ ఈ రోజు నుంచి భాయ్ సెట్స్ లోకి అడుగుపెట్టింది. వీరభద్రం చౌదరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి సంబందించిన ఓ ఐటెం సాంగ్ ని నాగార్జున – నథాలియా కౌర్ పై ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేసారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమాని అక్కినేని నాగార్జున సొంతంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు