బార్సిలోనాలో అదిరిపోయే లొకేషన్స్ లో పూరీ షూటింగ్

బార్సిలోనాలో అదిరిపోయే లొకేషన్స్ లో పూరీ షూటింగ్

Published on Feb 17, 2013 5:41 PM IST

Iddarammailatho

పంచ్ మాస్టర్ పూరి జగన్నాధ్ తన తాజా చిత్రం ‘ఇద్దరమ్మాయిలతో’ బార్సిలోనాలో వివిధ ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నాడు.అల్లు అర్జున్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్లో అమలా పాల్, కెథరిన్ థెరిసా హీరోయిన్స్. చిత్రవర్గం ఇదివరకు బార్సిలోనా కేథడ్రల్ లో చిత్రీకరించగా తాజా సమాచారం ప్రకారం పూరీ టీం ‘ది పాలో డి లా మ్యుసికా కాటలాన’ అనే అద్బుతమైన కాన్సెర్ట్ హాల్లో ఒక్క రోజు షూటింగ్ కి అనుమతి సంపాదించగలిగారట.

వరల్డ్ హెరిటేజ్ సైట్ గా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కాన్సెర్ట్ హాల్ లో షూటింగ్ జరుగుతున్న మొదటి తెలుగు సినిమాగా ‘ఇద్దరమ్మాయిలతో’ చరిత్ర సృష్టించింది. గతంలో ఈ కాన్సెర్ట్ హాల్ చాల ముఖ్యమైన సంగీత ప్రదర్శనలకు వేదికగా నిలిచింది. బార్సిలోనాలో నిర్మించిన అత్యంత సుందరమైన భవంతులలో ఇది ఒకటి. ఈ సినిమా నిర్మాత బండ్ల గణేష్ ‘ఇద్దరమ్మాయిలతో’ ని పెద్ద హిట్ చెయ్యడానికి వచ్చిన ఏ అవకాశమూ వదులుకోవడం లేదు. అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు