విక్రమ్ పై ట్విట్టర్లో మండిపడ్డ రానా

విక్రమ్ పై ట్విట్టర్లో మండిపడ్డ రానా

Published on Feb 17, 2013 5:30 PM IST

Rana-Vikram

రానా బాలీవుడ్లో తన ఉనికిని నిలుపుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగులో తన మొదటి చిత్రం ‘లీడర్’ తర్వాత, రోహన్ సిప్పీ ‘దమ్ మారో దమ్’ మరియు ఆర్.జి.వి ‘డిపార్ట్మెంట్’ చిత్రాలలో నటించాడు. అతడు అక్కడ మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తుంటే, ఆ కష్టం విక్రమ్ కు నచ్చినట్టు లేదు. విక్రమ్ తాజా సినిమా ‘డేవిడ్’ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో విక్రమ్ ని దక్షిణాది నటులు బాలీవుడ్లో ఎందుకు విజయం సాధించలేకపోతున్నారు అని అడగగా.. విక్రమ్ రానాని ఉదాహరణగా చూపించి ఇలా అన్నాడు. “రానా దగ్గుబాటిని చుడండి. తను తెలుగు ఇండస్ట్రీలో నటన మొదలుపెట్టి బాలీవుడ్ కి వచ్చాడు. కానీ అతను దక్షిణాదిన ఏమి సాదించలేదు. బాలీవుడ్లో పని చేయాలంటే, నేను ఇక్కడ అన్నీ వదిలేసుకుని అక్కడికి రావాలి”.

ఈ వ్యాఖ్యలు సహజంగానే రానాకి నచ్చలేదు. అనవసరమైన వ్యాఖ్యలు చేసిన విక్రమ్ ముందు తన కెరీర్ పై దృష్టి సారించమంటూ తనపై మండిపడ్డాడు. “ప్రియమైన విక్రమ్, నువ్వు కొన్ని మీడియా సంస్థల ద్వారా నన్ను ఉద్దేశించి చెప్పిన విషయాలు చూసాను. 10 డిజాస్టర్లకు దగ్గరవుతున్న నువ్వు నీ కెరీర్ పై దృష్టి పెట్టడం ఉత్తమం. నటుడిగా నా వయస్సు కేవలం రెండున్నర సంవత్సరాలు, కానీ నువ్వు ఇరవై ఐదు సంవత్సరాలకి దగ్గరవుతున్నావు. నేను నా గురించి ఆలోచిస్తున్నట్టే, నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచించుకో 😉 ఈ విషయంపై ఇక ఆలోచించకు, నేను కూడా నువ్వు నటించిన కొన్ని చిత్రాల పెద్ద ఫ్యాన్ ని 😉 ” అని ట్వీట్ చేసాడు.

రానా త్వరలో ఎస్. ఎస్ రాజమౌళి ‘బాహుబలి’, గుణశేఖర్ ‘రుద్రమ దేవి’ సినిమాలో కనిపించనున్నాడు.

తాజా వార్తలు