ముగిసిన రమ్ మొదటి షెడ్యూల్

ముగిసిన రమ్ మొదటి షెడ్యూల్

Published on Feb 17, 2013 4:30 PM IST

rum

ఎం.ఎస్.రాజు తెరకెక్కిస్తున్న ‘రమ్’ ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ‘రమ్’ అంటే ‘రంభ ఊర్వసి మేనక’. త్రిష, నికీషా పటేల్, ఇషా చావ్లా మరియు చార్మీ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గత 20రోజులుగా ఫిల్మ్ యూనిట్ మొత్తం మస్కట్ లో ఒమాన్ అన్న ప్రదేశంలో మొదటి షెడ్యూల్ చిత్రీకరించారు. ప్రధాన తారాగణంతో కొన్ని ఏక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాకా వచ్చిన ఫలితం యూనిట్ సబ్యులందరికీ ఆనందాన్ని కలిగించిందట.త్రిష చెన్నై తిరిగి రాగానే “ఆహ్ చెన్నై, మై చెన్నై. నిన్ను మించిన ప్రదేశం ఈ ప్రపంచంలోనే లేదు… మై బెడ్!! మై బేబీస్!!! అదిరిపోయే భోజనం ….ఇంట్లో ఉండటం చాల ఆనందంగా ఉందని” ట్వీట్ చేసింది.చార్మీ హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో జరగనున్న సి.సి.ఎల్-3 తెలుగు వారియర్స్ జట్టుకు మద్దతు తెలుపడానికి నిన్న రాత్రే హైదరాబాద్ కు చేరుకుంది.

తాజా వార్తలు