స్ట్రాంగ్ బజ్..”ఆదిపురుష్” కి ఆమెనే.!

స్ట్రాంగ్ బజ్..”ఆదిపురుష్” కి ఆమెనే.!

Published on Feb 26, 2021 8:00 AM IST

ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న పలు ఆసక్తికర మరియు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాల్లో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న “ఆదిపురుష్” కూడా ఒకటి. ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ ఎపిక్ వండర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరి ఇదిలా ఉండగా ఈ భారీ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ రావణ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మెయిన్ లీడ్ లో ఈ ఇద్దరిపై ఒక క్లారిటీ ఉంది కానీ ఫీమేల్ లీడ్ లో ఎవరు నటిస్తారు అన్నది మాత్రం ఇంకా ఒక తుది క్లారిటీ అయితే రాలేదు.. మరి ఈ సినిమాలో సీతగా ఎవరు కనిపిస్తారో అన్నది జాతీయ స్థాయి సినీ వర్గాల నుంచి స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది.

ఆమె మరెవరో కాదో కృతి సనన్ నే..ఈమె పేరు ముందు నుంచి గట్టిగ వినిపిస్తుంది. కానీ కన్ఫర్మా కాదా అన్న టాక్ కూడా ఉంది. మరి లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం ప్రస్తుతానికి ఆమె చేతిలో ఉన్న మొత్తం ఐదు ప్రాజెక్ట్ లలో ఆదిపురుష్ కూడా ఒకటి అన్నట్టు తెలుస్తుంది. సో ఇక ఈమెనే ఫిక్స్ అయ్యిపోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు