ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ భారీ చిత్రాల్లో పర్సనల్ గా ప్రభాస్ ఫ్యాన్స్ కు మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్లాన్ చేస్తున్న చిత్రమే. భారీ బడ్జెట్ తో స్కై ఫై థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై అప్డేట్స్ విషయంలో మాత్రం మేకర్స్ ఎక్కడా కూడా ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చెయ్యకుండా అప్ టు డేట్ ఇస్తున్నారు.
ఇక ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా నుంచి రెండు అప్డేట్స్ ఇస్తున్నామని కొన్నాళ్ల కిందట నాగ్ అశ్విన్ చెప్పారు అందులో ఒకటి ఆల్రెడీ ఇచ్చేసారు. కానీ రెండో అప్డేట్ మాత్రం ఈ ఫిబ్రవరి 26న ఇస్తాం అని చెప్పారు. మరి దీని కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా దానిపై ఈ దర్శకుడు క్లారిటీ ఇచ్చారు.
ఈ 26 న అప్డేట్ ఇవ్వడం లేదని, అలాగే ఇది సరైన సమయం కాదని అందుకు తనని క్షమించాలని సారీ చెప్పారు ఈ డైరెక్టర్. ఇది మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కు కాస్త నిరాశ కలిగించే వార్తే అని చెప్పాలి. మరి ఈ అప్డేట్ ను ఎప్పుడు ప్లాన్ చేసారో చూడాలి. ఇక ఈ భారీ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్ ఒక కీలక రోల్ లో కనిపించనున్నారు. అలాగే అశ్వనీదత్ 500 కోట్లకు పైగా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Hi…very sorry but there won't be an update on the 26th…pls excuse me…it's not the correct time…
— Nag Ashwin (@nagashwin7) February 15, 2021