నాగ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అప్పటికి పూర్తయిపోతుందా.?

నాగ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అప్పటికి పూర్తయిపోతుందా.?

Published on Feb 17, 2021 8:00 AM IST

కింగ్ నాగార్జున హీరోగా ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో లేటెస్ట్ గానే “వైల్డ్ డాగ్” మరియు పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ చిత్రం “బ్రహ్మాస్త్ర” సినిమాలను పూర్తి చేస్తున్నారు. మరి ఈ గ్యాప్ లో ఏమాత్రం లేట్ చెయ్యకుండా తన మరో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ను టాలెంటెడ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో స్టార్ట్ చేసేసారు.

దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని కేవలం రెండున్నర నెలల్లోపే పూర్తి చేసేయాలని నాగ్ డిసైడ్ అయ్యారట. ఇంతకు ముందు ప్రవీణ్ సత్తారు చేసిన ప్రాజెక్ట్స్ తో దీనిపై కూడా సాలిడ్ అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి లైన్ తో వస్తుందో తెలియాలి అంటే ఇంకా కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మాణం వహించనుండగా ఇతర అంశాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు