శంకర్ – చరణ్ భారీ ప్రాజెక్ట్ కు కూడా అతడేనా..?

శంకర్ – చరణ్ భారీ ప్రాజెక్ట్ కు కూడా అతడేనా..?

Published on Feb 14, 2021 8:40 AM IST

లేటెస్ట్ గా మన దక్షిణాది నుంచి అనౌన్స్ కాబడ్డ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది శంకర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లదే అని చెప్పాలి. వీరి కాంబో నుంచి సినిమా అనౌన్స్మెంట్ రాగానే అంచనాలు మరో స్థాయికి వెళ్లాయి. దీనితో పాన్ ఇండియన్ లెవెల్లో బాక్స్ ఆఫీస్ మోత మోగించే ప్రాజెక్ట్ ఒకటి రాబోతుంది అని అర్ధం అయ్యింది.

మరి ఇదిలా వుండగా ఈ భారీ ప్రాజెక్ట్ పై మరిన్ని బజ్ లు వినిపిస్తున్నాయి. మరి ఆ బజ్ ప్రకారమే ఈ చిత్రానికి సెన్సేషనల్ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం ఇస్తాడాని తెలుస్తుంది. ఇప్పటికే శంకర్ తో “భారతీయుడు 2” కు పని చేస్తున్న అనిరుధ్ మళ్లీ దీనికి సంగీతం అందివ్వనున్నట్టుగా గాసిప్స్ మొదలయ్యాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు