బాలయ్య సినిమా రిలీజ్ డేట్ కి రెడీ అవుతుందా ?

బాలయ్య సినిమా రిలీజ్ డేట్ కి రెడీ అవుతుందా ?

Published on Feb 14, 2021 1:33 AM IST

నట సింహం బాలయ్య బాబు – బోయపాటి శ్రీను సినిమా‌ మే 28న విడుద‌ల చేయ‌బోతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ కి రెడీ అవుతుందా అన్నది ఇప్పుడు అనుమానంగా మారింది. ఈ సినిమా ఇంకా నాలుగు షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకోవాలట. పైగా ఒక్క ఇంటర్వెల్ సీక్వెన్స్ నే తీయడానికి దాదాపు పది రోజులు పడుతుందని.. దీనికి తోడు షూటింగ్ బాగా లేట్ అవుతుందని తెలుస్తోంది.

కాగా బోయపాటి, బాలయ్య సినిమా అంటే కచ్చితంగా అదిరిపోయే టైటిల్ ఉండాలి. అందుకే ఈ సినిమా టైటిల్ పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. మెయిన్ గా ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ తో బాగా వినిపించింది. ఓ దశలో మోనార్క్ టైటిల్ ను ఫైనల్ చేశారని కూడా బాగా వార్తలు వచ్చాయి. అన్నట్టు ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ మెయిన్ హీరోయిన్. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు