మురగదాస్ అసిస్టెంట్ తో ‘ధృవ్’ ?

మురగదాస్ అసిస్టెంట్ తో ‘ధృవ్’ ?

Published on Feb 14, 2021 12:52 AM IST

తమిళ స్టార్ చియాన్ విక్రమ్ కుమారుడు ‘ధృవ్’ మొదటి సినిమాతోనే నిరూపించుకోగలిగాడు. తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తో తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఈ నట వారసుడు. మొదటి సినిమాతోనే వేరియేషన్స్ చూపిస్తూ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా బాగా పేరు తెచ్చుకున్నాడు. ఇక తన తరువాత సినిమాల కోసం ఇప్పటికే రెండు స్క్రిప్ట్స్ ను లైన్ లో పెట్టాడట.

కాగా మురగదాస్ అసిస్టెంట్ రవికాంత్ అనే కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో సినిమాని చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం ధృవ్ ప్రస్తుతం కొత్త హెయిర్ స్టైల్ తో పాటు షార్ప్ లుక్ కోసం తన ఫామ్ హౌస్ లో ఏకాంతంగా గత కొన్ని రోజులు నుండి తన ట్రైనర్ సాయంతో కఠినతరమైన కసరత్తులు చేస్తుకుంటూ తనని తాను కొత్తగా మార్చుకుంటున్నాడట. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా సెన్సేషన్ బ్యూటీ ‘ప్రియా ప్రకాష్ వారియర్’ను తీసుకుంటున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు