పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్ రానుంది. అయితే తాజా గాసిప్ ఏమిటంటే, ఈ చిత్రంలో ఒక్క పాట కూడా ఉండదట. మెయిన్ థీమ్ సాంగ్ మాత్రమే ఉంటుందట. ఇక పవన్ ఒరిజినల్ వెర్షన్లో బిజూ మీనన్ చేసిన పోలీస్ పాత్ర చేయనున్నారు. అయితే మళయాళ వెర్షన్, తమిళ వెర్షన్ మధ్య చాలా తేడా ఉంటుందట.
ఇక సినిమాలో హైఓల్టేజ్ యాక్షన్, పవన్ మార్క్ ఎంటర్టైన్మెంట్ ఖాయమని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాకు ఒకప్పటి చిరంజీవి చిత్రం ‘బిల్లా రంగా’ టైటిల్ ను వాడుకోవాలనే యోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.