‘కింగ్’ అక్కినేని నాగార్జున నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘భాయ్’ జనవరి 4వ తేదీ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ‘ఆహనా పెళ్ళంట’, ‘పూల రంగడు’ సినిమాలు తీసిన వీరభద్రం చౌదరి ఈ సినిమాకి డైరెక్టర్. నాగ్ సరసన రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సోనూ సూద్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాని నాగార్జున తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ పై నిర్మిస్తున్నారు.
యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ ని రామజోగయ్య శాస్త్రి రాస్తున్నారు. ఈ సినిమా నాగార్జున కెరీర్లో వచ్చిన ‘హలో బ్రదర్’ లాగా ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.