సింహాచలంలో ‘బలుపు’

సింహాచలంలో ‘బలుపు’

Published on Dec 29, 2012 5:40 PM IST

raviteja-in-balupu

2012 సంవత్సరం రవితేజకి చేదు అనుభవమే మిగిల్చింది. ఈ సంవత్సరం అతడు నటించిన నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు, సారొచ్చారు నాలుగు సినిమాలు విడుదల కాగా అన్ని సినిమాలు అతనికి నిరాశనే మిగిల్చాయి. 2013లో విజయంతో ప్రారంభించాలనే గట్టి నమ్మకంతో ఉన్నాడు రవితేజ. తనకు డాన్ శీను సినిమా ఇచ్చిన గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వస్తున్న చిత్రం ‘బలుపు’. ఈ చిత్ర షూటింగ్ సింహాచలం గుడిలో షూటింగ్ జరుగుతుంది. వైజాగ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో సింహాచలం గుడిలో షూటింగ్ చేయాలని అనుకున్నట్లు దర్శకుడు అన్నాడు. రవితేజకి జోడీగా శృతి హాసన్, అంజలి నటిస్తున్న ఈ సినిమాలో అంజలి మెడికల్ స్టూడెంట్ పాత్రలో నటిస్తుంది.

తాజా వార్తలు