“దేశ భాషలందు తెలుగు లెస్స” అన్నారు. తెలుగు భాషలో మాధుర్యం తెలుపడానికి పదాలు సరిపోవేమో. ఏ కవి అందాన్ని వర్ణించినా తెలుగులోనే కదా, మరి తెలుగు అందాన్ని ఏ భాషలో వర్ణించగలం. మన మాతృ భాష తెలుగు గౌరవర్ధకంగా ఈరోజు తిరుపతిలో ప్రపంచ తెలుగు మహా సభలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా తిరుపతిలో ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. తెలుగు భాష అంతరించిపోతుందా అనే సమయంలో ఇటువంటి కార్యక్రమం జరగడం నిజంగా ఆనందదాయకం. ఈ ఏర్పాట్లలో భాగంగా తిరుపతిలో మూడు రోజులు పాటు రెండు ధియేటర్ లు ప్రతాప్, బిగ్ సినిమాస్ లలో తెలుగు చలన చిత్రోత్సవం జరుపుతున్నారు ఇందులో భాగంగా తెలుగులోని కొన్ని ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాలను ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. “మిథునం”, “అన్నమయ్య”, “ఆంధ్రకేసరి”, “శ్రీ కృష్ణ పాండవీయం”, “మాయాబజార్”, “నర్తనశాల”, “శంకరాభరణం”, “భక్త కన్నప్ప” ,”ఓనమాలు” తదితర చిత్రాలను మూడు రోజుల పాటు ప్రదర్శించనున్నారు. తెర మీద తెలుగుదనం కరువయిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఒక కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకం. పర భాషకు గౌరవం ఇద్దాం మాతృ భాషను ప్రేమిద్దాం.
తెలుగు మహాసభలలో స్వచ్చమయిన తెలుగు చిత్రాల ప్రదర్శన
తెలుగు మహాసభలలో స్వచ్చమయిన తెలుగు చిత్రాల ప్రదర్శన
Published on Dec 27, 2012 10:00 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- ‘ఓజి’ ట్రైలర్ పై కొత్త బజ్!
- బుకింగ్స్ లో ‘మిరాయ్’ ఫుల్ ఫ్లెడ్జ్ ర్యాంపేజ్ మొదలు!
- ఓటిటిలోకి వచ్చేసిన బాలీవుడ్ ని షేక్ చేసిన ‘సైయారా’
- అప్పుడే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అనుపమ రీసెంట్ సినిమా
- జాంబీ రెడ్డి.. ఈసారి ఇంటర్నేషనల్..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్ ఎప్పుడు షురూ చేస్తారు..?
- మరోసారి ఓటీటీలో థ్రిల్ చేసేందుకు వస్తున్న త్రిష
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- హైదరాబాద్లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- ‘మిరాయ్’ సర్ప్రైజ్.. రెబల్ సౌండ్ మామూలుగా ఉండదు..!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!