కామెడీ హీరో సునీల్, ఇషా చావ్లా జంటగా నటిస్తున్న సినిమా ‘Mr. పెళ్ళికొడుకు’. ఈ సినిమా హిందీలో హిట్ అయిన ‘తను వెడ్స్ మను’ సినిమాకి రీమేక్. మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ ప్రసాద్ డైరెక్టర్. ఎస్.ఎ రాజ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోని జనవరిలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే తెలియజేసే అవకాశం ఉంది.
సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి నందమూరి హరి ఎడిటర్. ఆలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆహుతి ప్రసాద్, రవిబాబు, ఎం.ఎస్ నారాయణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూలరంగడు హిట్ సినిమా తర్వాత సునీల్ – ఇషా చావ్లా కాంబినేషన్లో వస్తున్నా రెండవ సినిమా ఇది.