కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా ‘బ్లేడ్ బాబ్జీ’ డైరెక్టర్ దేవీ ప్రసాద్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కెవ్వు కేక’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో షర్మిలా మాండ్రే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ ‘బాబు రాంబాబు’ అనే పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో హీరో , హీరోయిన్ తో పాటు హాట్ ఐటెం భామలు అయిన ముమైత్ ఖాన్, కిరణ్ రాథోడ్ లు కూడా కలిసి స్టెప్పులేస్తున్నారు. బొప్పన చంద్ర శేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘యముడికి మొగుడు’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫైనాన్సియల్ ఇబ్బందుల వల్ల కొన్ని ఏరియాల్లో మార్నింగ్ షోలు వాయిదా పడ్డా, మాట్నీ షో నుంచి అన్ని ఏరియాల్లో షోలు పడుతున్నాయి. వెళ్లి చూసి ఎంజాయ్ చెయ్యండి.