గుండె జారి గల్లంతయ్యిందే ఫస్ట్ లుక్ విడుదల

గుండె జారి గల్లంతయ్యిందే ఫస్ట్ లుక్ విడుదల

Published on Dec 26, 2012 11:02 PM IST

gunda-jari-gan
నితిన్ మరియు నిత్య మీనన్ గతంలో “ఇష్క్” చిత్రంతో ప్రేక్షకుల మనసుని దోచుకున్నారు. ఈ జంట మరోసారి ప్రేక్షకుల ముందుకి రానున్నారు. నూతన దర్శకుడు విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో రానున్న “గుండె జారి గల్లంతయ్యిందే” చిత్రంలో వీరు ఇద్దరు కనిపించనున్నారు. “హైట్స్ ఆఫ్ లవ్” అన్న శీర్షికతో ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ చిత్రాన్ని శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ మీద సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా ఐ. ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నితిన్ పక్కన స్టూల్ మీద నిలబడుకున్న నిత్యతో విడుదల చేసిన ఫస్ట్ లుక్ చూపరులను ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. ఈ చిత్రం దాదాపుగా 70% చిత్రీకరణ పూర్తి చేసుకుంది వచ్చే ఏడాది మొదట్లో విడుదల కానుంది.

తాజా వార్తలు