“రాధే శ్యామ్” ఫీస్ట్ రెడీ అవుతుందా?

“రాధే శ్యామ్” ఫీస్ట్ రెడీ అవుతుందా?

Published on Sep 13, 2020 7:35 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. సాహో లాంటి ఫుల్ ఆన్ మాస్ ఎంటర్టైనర్ తర్వాత అందుకు పూర్తి భిన్నంగా ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను ప్రభాస్ ఎన్నుకొన్నారు. దీనితో ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అలాగే చిత్ర యూనిట్ కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుండం మొదలు పెట్టారు.

అంతే కాకుండా ఇక నుంచి రెగ్యులర్ గా కూడా అన్ని అప్డేట్స్ వస్తుంటాయని తెలిపారు. అయితే ఇపుడు రానున్న ప్రభాస్ పుట్టినరోజుకు రాధే శ్యామ్ టీం ఒక సర్ప్రైజ్ ను ప్లాన్ చేసారని బజ్ వినిపించింది. అందుకు తగ్గట్టు గానే ఫీస్ట్ ను రెడీ చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది. వచ్చే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ వచ్చే సూచనలు ఉన్నట్టు మరో సారి టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఒకవేళ టీజర్ వస్తే అదెలా ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు