వినాయక చవితి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు, ప్రేక్షకులకు, ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా లో ఒక వీడియో ద్వారా తన సందేశాన్ని పంచుకున్నారు. సినిమా షూటింగ్స్ ఇంకా మొదలు కాలేదు అని, ఎపుడు మొదలవుతాయో తెలీదు అని, పని లేక సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
అయితే సినీ కార్మికులకు అండగా ఉండేందుకు మూడో సారి సిసిసి తరపున నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాక ఆల్రెడీ నిత్యవసర వస్తువుల పంపిణీ మొదలు పెట్టాం అని అన్నారు. రాష్ట్రం లో ఉన్న యూనియన్స్, సినీ అసోసియేషన్స్, జర్నలి స్ట్ లతో పాటుగా, ఆంధ్ర లో ఉన్నా వర్కర్స్ కి, రెండు రాష్ట్రాల్లో ఉన్న డిస్ట్రిబ్యూషన సెక్టార్స్ లో పోస్టర్స్ నుండి కార్మికులు గా లని చేస్తున్న ప్రతి ఒక్కరికీ కూడా ఈ నిత్యావసరాలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని తెలిపారు. మొత్తం మీద సుమారు పది వేల మందికి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
అయితే ఇపుడు పరిస్థితి శాశ్వతం కాదు, తాత్కాలికమే అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కొద్ది రోజుల పాటు ఎదుర్కొని ధైర్యం గా నిలబడదాం అని పిలుపు ఇచ్చారు.పని చేసుకొని సంతోషం గా గడిపే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి అని ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబానికి ముఖ్యంగా ఆరోగ్యం అవసరం అని అన్నారు. నిర్లక్ష్యము పనికి రాదు అని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అని చిరు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో అన్ని సమస్యలు ఎదుర్కొంటు, కుటుంబానికి రక్షణగా నిలవాలి అని చిరు అన్నారు. అంతేకాక అన్ని సమస్యలు తొలగి పోవాలి అని అందరం కలిసి ఆ వినాయకుడికి మొక్కుకుందాం అని అన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపి, మీ చిరంజీవి అంటూ తన సందేశాన్ని ముగించారు.
Hope & Gratitude ! pic.twitter.com/vLi22WtZe9
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 21, 2020
Attachments area