“ఆదిపురుష్”లో ప్రభాస్ నుంచి మరో ట్రాన్స్ఫర్మేషన్.!

“ఆదిపురుష్”లో ప్రభాస్ నుంచి మరో ట్రాన్స్ఫర్మేషన్.!

Published on Aug 21, 2020 2:42 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి భారీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టడంతో గత కొన్ని రోజుల నుంచి అటు బాలీవుడ్ మరియు మన టాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రభాస్ పేరే అలా హాట్ టాపిక్ గా కొనసాగుతుంది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓం రౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ ఎపిక్ వండర్ పై ఏ చిన్న అంశం అయినా సరే సంచలనంగానే మారుతుంది.

ఒక వారియర్ గా ప్రభాస్ ఎలా ఉంటాడో మనం ఇప్పటికే చూసాం. రోల్ ఎలాంటిది అయినా సరే ప్రభాస్ కటౌట్ అలా సరిపోతుంది అంతే. అందుకే ప్రభాస్ ను తప్ప రామునిగా మరొకరి విజువల్ నాకు కనపడలేదని రౌత్ తెలిపారు. తన ప్రతీ సినిమాకు తనని తాను ప్రత్యేకంగా మార్చుకుంటాడు డార్లింగ్.

అలాగే ఇప్పుడు ఆదిపురుష్ కోసం కొన్ని కీలక యుద్ధ సన్నివేశాల కోసం మళ్ళీ విలు విద్య నేర్చుకోడానికి తనని తాను ట్రాన్సఫర్మెట్ చేసుకోనున్నాడని తెలుస్తుంది. అంటే రాముని పాత్రలో ప్రభాస్ విల్లు పట్టుకొని ఉంటాడో ఓసారి ఊహించుకోండి అలా ప్రభాస్ మారనున్నాడని మేకర్స్ అంటున్నారు.

తాజా వార్తలు