గత కొన్నాళ్ల కితం బాలీవుడ్ యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్యా ఘటన ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. అతని ఆత్మ హత్య వెనుక వేరే ఏదో బలమైన కారణం మరియు కారకులు ఉన్నారని ఎన్నో రకాల అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
అయితే ఇదే అంశానికి సంబంధించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మాత్రం మొదటి నుంచి చాలా స్ట్రాంగ్ గా నిలబడింది. అలాగే ఎంతో మంది మిగతా బాలీవుడ్ అగ్ర నటులు మరియు నిర్మాతలు పై సంచలన ఆరోపణలు చేసింది. అలా ఇప్పుడు ఈమె బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ పై పలు సెన్సేషనల్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది.
నిన్న ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఖాన్స్ పేర్లతో పాటు అమితాబ్ పేరును కూడా తీసి మీరెందుకు ఈ కేసు విషయంలో మాట్లాడ్డం లేదని ప్రశ్నించారు. అలాగే అమితాబ్ లాంటి పెద్ద వారే మాట్లాడ్డానికి భయపడితే మిగతావారు మాత్రం ఎలా ధైర్యం చేస్తారని కామెంట్స్ చేసారు.