ప్రభాస్ ఛాలెంజ్ ను పూర్తి చేసిన రానా.!

ప్రభాస్ ఛాలెంజ్ ను పూర్తి చేసిన రానా.!

Published on Aug 20, 2020 5:10 PM IST

ఈ మధ్య కాలంలో మొత్తం సినీ వర్గాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు అలా మారుమోగుతూనే ఉంది. అలాగే మరోపక్క మన సినీ వర్గాల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కూడా పెద్ద ఎత్తున అలా కొనసాగుతుంది. అలా రాజ్యసభ సభ్యులు, జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతుంది.

ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొని ఇళయ తలపతి విజయ్ ను కూడా ఛాలెంజ్ చేయడం వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ ఛాలెంజ్ మన బాహుబలి వరకు రాగా ప్రభాస్ ఇప్పుడు తన సోదరుడు భల్లాలదేవ మన టాలీవుడ్ హల్క్ దగ్గుబాటి రానాకు ఈ ఛాలెంజ్ విసిరారు. దీనితో ఈ ఛాలెంజ్ లో భాగంగా రామానాయుడు స్టూడియోలో మూడు మొక్కలు నాటి ప్రభాస్ విసిరిన ఛాలెంజ్ ను పూర్తి చేసారు.

దీనిపై రానా మాట్లాడుతూ “సమాజానికి మేలు చేసే ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు డార్లింగ్ ప్రభాస్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అని. ఈ కార్యక్రమంలో నా అభిమానులు, మా దగ్గుబాటి కుటుంబ అభిమానులు, ప్రకృతి ప్రేమికులంతా పాల్గొని ముందుకు తీసుకుపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా, అంతేకాదు.. ఈ సంకల్పానికి నావంతు ప్రయత్నంగా ఎవరు మొక్కలు నాటి నాకు ట్యాగ్ చేసినా రీట్విట్ చేస్తా” అని రానా తెలిపారు.

తాజా వార్తలు