గీతా ఆర్ట్స్ ఆఫీస్ దగ్గర స్టైలిష్ “పుష్ప”.!

గీతా ఆర్ట్స్ ఆఫీస్ దగ్గర స్టైలిష్ “పుష్ప”.!

Published on Aug 20, 2020 2:41 PM IST

ప్రస్తుతం కరోనా వల్ల నెలకొన్న పరిస్థితుల మూలాన మన టాలీవుడ్ లో పెద్ద బ్రేక్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దీనితో మన స్టార్ హీరోలు అంతా పెద్దగా బయట కూడా కనిపించకుండా ఇళ్లకే పరిమితం అయ్యారు. అలాగే ఇళ్లలో చేసే ఫంక్షన్స్ లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు కానీ బయట తిరిగే సాహసం మాత్రం చేయడం లేదు. కానీ ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం తమ గీతా ఆర్ట్స్ ఆఫీస్ దగ్గర కనిపించి ఆశ్చర్యపరిచారు.

రెడ్ టీ షర్ట్ తో కూలింగ్ గ్లాస్ పెట్టుకొని “పుష్ప” కోసం పెంచిన హైర్ స్టైల్ లో ఆ రఫ్ పుష్ప ను స్టయిలిష్ గా రెడీ చేస్తే ఎలా ఉంటాడో అలా కనిపించి బన్నీ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చాడు. “చాలా కాలం తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చానని ఈ కష్ట కాలం త్వరగా పూర్తి కావాలని కోరుకుంటున్నా” అని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అలాగే బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో రెండు భారీ ప్రాజెక్టులను లైన్ లో ఉంచుకున్నారు.

https://www.instagram.com/p/CEGcIxHHNyF/

తాజా వార్తలు