గత కొన్ని రోజుల నుంచీ నాచురల్ స్టార్ నాని మరియు సుధీర్ బాబులు మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “వి” కోసం అలా కొంత సస్పెన్స్ నడుస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు నేరుగా ఓటిటిలో విడుదల అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
కానీ ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల చెయ్యాలని మొదట మేకర్స్ ప్రయత్నించినా తర్వాత మాత్రం ఎట్టకేలకు డిజిటల్ గానే విడుదలకు రెడీ అయ్యింది. నిన్ననే నాని కూడా నేరుగా ఇంటికే తమ చిత్రాన్ని తీసుకొస్తామని హింట్ ఇవ్వడంతోనే అందరికీ అర్ధం అయ్యిపోయింది.
దీనితో అంతా ఊహించినట్టుగానే చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో నేరుగా స్ట్రీమింగ్ కు రానున్నట్టు ప్రకటించేసారు. ఈ చిత్రాన్ని వచ్చే సెప్టెంబర్ 5 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా ముహూర్తం ఫిక్స్ చేసారు.
ఈ చిత్రంలో నివేత థామస్ మరియు అదితి రావ్ హైదరీ ఫిమేల్ లీడ్ లో కనిపించనుండగా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం మాత్రం స్ట్రీమింగ్ వీక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉండనుందో తెలియాలి అంటే వచ్చే సెప్టెంబర్ 5 వరకు ఆగాల్సిందే.
The hunt is on! ✌#VOnPrime Sept 5, on @PrimeVideoIN@NameisNani @isudheerbabu @i_nivethathomas @aditiraohydari @mokris_1772 #DilRaju #Shirish #HarshithReddy @ItsAmitTrivedi @MusicThaman @pgvinda #MarthandKVenkatesh pic.twitter.com/IK0x6avbcT
— Sri Venkateswara Creations (@SVC_official) August 20, 2020