అక్కినేని యువ హీరో అక్కినేని అఖిల్ కు తన మొదటి సినిమా నుంచి కూడా మంచి హిట్ లేకపోయినా సరే మంచి ఆఫర్స్ వస్తుండటమే కాకుండా మంచి బిజినెస్ కూడా జరుపుకుంటున్నాడు. అలా తనకు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్” కు కూడా మంచి బిజినెస్ అవుతుంది అనుకున్న సమయంలోనే అఖిల్ తో టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరైన సురేందర్ రెడ్డి ఓ సినిమాను ప్లాన్ చేసారని టాక్ వినిపించింది.
కానీ ఈ చిత్రానికి మాత్రం ఇప్పుడు నిర్మాత దొరకడం కాస్త కష్టంగా ఉందని టాక్ వినిపిస్తుంది. అందుకు కారణం సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి భారీ బడ్జెట్ నెంబర్ చెప్తుండటమే అని తెలుస్తుంది. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని 40 కోట్లకు పైగానే ప్లాన్ చేశారట. అలా మొదట క్రిష్ నిర్మాణ సంస్థతో మాట్లాడగా వారితో డీల్ కుదరలేదట. దీనితో ఇప్పుడు సురేందర్ రెడ్డి కొత్త నిర్మాత కోసం ఎదురు చూస్తున్నట్టు టాక్.