సల్మాన్ పై మర్డర్ ప్లాన్ ను ప్లాప్ చేసిన పోలీసులు.!

సల్మాన్ పై మర్డర్ ప్లాన్ ను ప్లాప్ చేసిన పోలీసులు.!

Published on Aug 19, 2020 8:29 PM IST


గత కొంత కాలం నుంచి బాలీవుడ్ లో పలు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అలా ఇప్పుడు ఊహించేంచని విధంగా చోటు చేసుకున్న మరో సంచలన సంఘటన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై హత్యా యత్నం. నిజమే ఇది వినడానికి షాకింగ్ ఉన్నా సళ్ళూ భాయ్ పై హత్యా యత్నం జరిగిందట.

ఇటీవలే ఆగష్టు 15 ఫరీదాబాద్ లో జరిగిన హత్యా ఘటనకు సంబందం ఉన్న ఒక షార్ప్ షూటర్ ను అక్కడి పోలీసులు ప్లాన్ చేసి పట్టుకొని సల్మాన్ పై వేసిన మర్డర్ ప్లాన్ ను ఛేదించారు. ఈ రాహుల్ అనే వ్యక్తి పంజాబ్ కు చెందిన లారెన్స్ బిష్ణయ్ అనే గ్యాంగ్స్టర్ గ్యాంగ్ కు చెందిన షార్ప్ షూటర్ అట.

పోలీసుల విచారణ అతను తాము తర్వాత మర్డర్ ప్లాన్ చేసింది సల్మాన్ పైనే అని చెప్పి షాకిచ్చాడు. అలాగే వారి రిపోర్టుల ప్రకారం అతను గత జనవరి ముంబైలో జరిగిన సల్మాన్ అపార్ట్మెంట్ దగ్గర రెక్కీలో కూడా ఉన్నాడని తెలిసింది.

అలాగే సల్మాన్ ను చంపేందుకు అతను ఫుల్ గా ప్లాన్ చేసుకొని వచ్చాడని అతని అనుచరుల నుంచి సిగ్నల్ వస్తే చంపేద్దామని అనుకున్నాడని విచారణలో తేలింది. అలా ఇప్పుడు పోలీసులు ఈ రాహుల్ ద్వారా లింకప్ అయ్యి ఉన్న అందరిని పెట్టుకునేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

తాజా వార్తలు