రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ నిర్మాత మృతి.!

రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ నిర్మాత మృతి.!

Published on Aug 19, 2020 7:05 PM IST


ఈ కరోనా సమయం తెలుగు సినిమాకు కూడా తీరని నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. తాజాగా టాలీవుడ్ లో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది.మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన రీసెంట్ హిట్ చిత్రం “కనులు కనులను దోచాయంటే” నిర్మాత కమలాకర్ రెడ్డి ఘోర రోడ్డు ప్రమాదం మూలాన మృతి చెందిన ఘటన విషాదాన్ని నెలకొల్పింది. వివరాల్లోకి వెళ్లినట్టయితే ఈ ప్రముఖ నిర్మాత తండ్రికి కరోనా ట్రీట్మెంట్ నిమిత్తం నెల్లూరు నుంచి హైదరాబాద్ కు తరలించాల్సి వచ్చింది.

కానీ భారీ వర్షాలు కారణంగా ఆయన మరియు అతని తండ్రితో ఉన్న అంబులెన్స్ రోడ్డు మీద అదుపు తప్పి రోడ్డు మీద పార్క్ చేసి ఉన్న ఒక లారీని బలంగా గుద్దుకోవడం మూలాన కమలాకర్ రెడ్డి మరియు ఆయన తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే ఆ అంబులెన్స్ డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన మృతి పట్ల మా 123తెలుగు టీం వారి కుటుంబానికి సంతాపం తెలుపుతుంది.

తాజా వార్తలు